ఏదైనా సమస్య ఉంటే... సిద్దిపేటలో ఉన్నప్పడే తనని కలవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని చెప్పారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి తన కోసం హైదరాబాద్ రావొద్దని స్పష్టం చేశారు. ఇంతదూరం వచ్చి ఒకవేళ పని జరగకపోతే ప్రజల మనసు నొచ్చుకుంటుందని... అది తనకు కూడా బాధ కలిగిస్తుందని వివరించారు. ఇకపై సిద్దిపేటలో ఉన్నప్పుడే తనను కలవాలని పేర్కొన్నారు.
'మీ మనసు నొచ్చుకుంటే నాకు బాధైతది' - MINISTER HARISH RAO EMOTION WORDS
'వారంలో నాలుగు దినాలు నేను సిద్దిపేటలోనే ఉంటా. అయినా మీరు నన్ను కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నరంటే... నాకెక్కడో మీకు సేవ చేయలేకపోతున్ననని అనిపిస్తోంది'. - హరీశ్ రావు, మంత్రి
'మీ మనసు నొచ్చుకుంటే నాకు బాధైతది'