తెలంగాణ

telangana

ETV Bharat / state

మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్​

పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్​ను అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. రూ.10 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు రూ.3 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్బర్ విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఆలయం, మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎస్​ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

akbaruddin owaisi meet cm kcr
akbaruddin owaisi meet cm kcr

By

Published : Feb 9, 2020, 5:03 PM IST

Updated : Feb 9, 2020, 6:34 PM IST

మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్​

హైదరాబాద్​ పాతబస్తీ లాల్‌ దర్వాజ సింహవాహిణి మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం శాసనాసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అఫ్జల్‌గంజ్‌ మసీదు మర్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మహంకాళి ఆలయానికి చాలినంత స్థలం లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని.. భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. రూ.10 కోట్లు వ్యయంతో ఆలయాన్ని విస్తరించి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలయ విస్తరణతో ఆస్తులు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ అధీనంలోని ఫరీద్‌ మార్కెట్‌ స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అఫ్జల్‌గంజ్‌ మసీద్‌ మర్మతుల కోసం మూడు కోట్లు మంజూరు చేయాలని కోరారు. అక్బరుద్దీన్​ ఒవైసీ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఆ రెండింటి అభివృద్ధికి ... తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్​ను సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి:ప్రగతిభవన్‌లో సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం

Last Updated : Feb 9, 2020, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details