భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌గా కొనసాగుతుందని.. మైక్రాన్ టెక్ సంస్థ సీఈవో సంజయ్ మెహరోత్రా స్పష్టం చేశారు. కంపెనీ.. రెండేళ్ల జర్నీని పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో కలిసి దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో త్వరలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' పేరిట ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంజయ్ మెహరోత్రా తెలిపారు. 93శాతం ఉద్యోగాలు స్థానికులకేనని స్పష్టం చేశారు. రెండేళ్లలో కంపెనీ సాధించిన విజయాలను.. మంత్రితో పంచుకున్నారు