తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ ప్రశ్నిస్తే... అభివృద్ధి చేయరట!

నాయకులకు అనుకూలంగా ఉంటే కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరాను కల్పిస్తారు. సమస్యలపై ప్రశ్నించిన వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారని హైదరాబాద్ మల్లాపూర్​ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో గత ఆరు సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పినా... ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

By

Published : Sep 22, 2019, 9:22 PM IST

మా సమస్యలు నాయకులకు పట్టవా?

మా సమస్యలు నాయకులకు పట్టవా?

హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేఎల్​ రెడ్డినగర్‌, హెచ్​సీఎల్ నగర్లలో రోడ్లు, నీటిసౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లుగా రోడ్ల నిర్మాణం చేపట్టక పోవడం వల్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

ఎందుకీ పక్షపాత ధోరణి...?

కొన్ని సంవత్సరాలుగా తమ పరిస్థితిని ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అదేకాలనీలో నాయకులకు అనుకూలంగా ఉన్న పలువురి వార్డుల్లో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ కాలనీకి వచ్చేసరికి మాత్రం సమస్యలపై స్పందించటం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన నేతలు... అందరి సమస్యలు తీర్చకుండా పక్షపాతం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ కాలనీకి రోడ్లు నిర్మించటంతోపాటు, నీటి సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇవీచూడండి:'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details