మరో 24 గంటలు గడిస్తేనే...
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తేగాని పూర్తిస్థాయి నిర్ధరణకు రాలేమన్నారు.
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిన్నటి కంటే ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైందని తెలిపారు. మరో 24 గంటలు గడిస్తేగాని ఎటువంటి నిర్ధరణకు రాలేమని తెలిపారు. చేతులు, వీపు భాగంలో తీవ్రగాయాలై అధిక రక్తస్రావమైందని పేర్కొన్నారు. తుప్పుపట్టిన కత్తితో దాడిచేశారని, ఇన్ఫెక్షన్ సోకిందని వివరించారు. ఈరోజు కొన్ని శస్త్ర చికిత్సలు నిర్వహించాలని భావిస్తున్నామని వైద్యులు తెలిపారు.