ఐటీఐ చదివిన విద్యార్థులకు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌పీ సెట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. వంద రూపాయల ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని.. 23వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎల్‌పీ సెట్ పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. పరీక్ష జరిగిన పది రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు 300 రూపాయలు, మిగతా అభ్యర్థులు 500 రూపాయలు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు http://sbtet.telangana.gov.inలేదా మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో తెలుసుకోవాలని నవీన్ మిత్తల్ సూచించారు.