LOW PRESSURE AT SOUTH ANDAMAN SEA : దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. క్రమంగా వాయవ్య దిశకు కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. ఇది మరింతగా బలపడుతూ 8వ తేదీ ఉదయానికి తుపానుగా మారే సూచనలున్నట్లు తెలియజేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
అండమాన్లో అల్పపీడనం.. రాష్ట్రానికి మరో తుపాను ముప్పు.. - ఏపీ వాతావరణ శాఖ
LOW PRESSURE AT SOUTH ANDAMAN SEA: దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. ఇది మరింతగా బలపడుతూ వాయుగుండంగా మారి అక్కడి నుంచి తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
weather
8వ తేదీ నుంచి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతోపాటు రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఇవీ చదవండి: