కరోనా వ్యాప్తి కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ జంటనగరాల్లో పటిష్ఠంగా అమలవుతోంది. ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనవసరంగా రోడ్లపై సంచరించే వాహనదారులకు చలాన్లు విధిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎందుకు రోడ్లపైకి రావాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నారు తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు.
జంటనగరాల్లో పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలు
జంటనగరాల్లో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ప్రధాన కూడళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు... వాహనదారుల ప్రయాణాలపై ఆరా తీస్తున్నారు. అనవసరంగా రోడ్లపై సంచరించే వారికి చలాన్లు విధిస్తున్నారు.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్, లాక్‌డన్ పటిష్ఠంగా అమలు
అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లే వారిని అనుమతిస్తున్నారు. ప్రధానంగా ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం