విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణమైన స్టెరైన్ నిల్వలను పూర్తిగా తరలించామని ఎల్జీ పాలిమర్స్ ఎండీ జియోంగ్ సుంకీ వెల్లడించారు. పరిశ్రమ ప్రాంగణంలో, పోర్టు ట్యాంకుల్లో ఉన్న స్టెరైన్ మోనోమర్‌ని పూర్తిగా ఖాళీ చేసి పంపించామని ప్రకటించారు. బాధిత గ్రామాల ప్రజలకు సహాయంగా ఉండేందుకు 200 మందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారికి ఆహారం, వైద్య సదుపాయాలన్నీ అందిస్తామని తెలిపారు. సురక్ష ఆసుపత్రిని ఏర్పాటుచేసి భవిష్యత్తులో బాధిత కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు, వైద్య సదుపాయం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం' - latest cc footage of vishaka gas leak news
ఏపీ విశాఖలోని బాధిత గ్రామాల్లో పూర్తి సహాయ కార్యక్రమాలు చేపట్టి, అనారోగ్యానికి గురైన కుటుంబాలను ఆదుకుంటామని ఎల్‌జీ పాలీమర్స్ ఎండీ జియోంగ్ సుంకీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'