పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్, ఎండోమెంట్స్ కార్యాలయంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 150 మంది బ్రాహ్మణులకు కూరగాయాలు, పండ్లు, బియ్యం, ఆయిల్ అందజేశారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఓ బ్రాహ్మణ కుటుంబానికి రూ.30 వేల చెక్‌ను ఇచ్చారు.
పేద పురోహితులకు సాయం చేసిన కేవీ రమణాచారి
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి సాయం చేశారు. సుమారు 150 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న ఓ కుటుంబానికి రూ. 30 వేల చెక్కును అందజేశారు.
సాయం చేయకలిగిన వారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రమణాచారి పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణ పురోహితులకు సహాయం అందించడం సంతోషంగా ఉందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రమణాచారితోపాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌టీఐ కమిషనర్ శంకర్‌నాయక్, మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!