తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓడిన వారిని దెప్పిపొడవడం సరికాదు' - trs

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోను గెలుపొందిన నేతలకు పార్టీ తరఫున శుభాకాంక్షలు  తెలిపారు.  ఎన్నికల్లో ఓటమిపాలైన వారిని దెప్పిపొడవడం సబబు కాదని వ్యాఖ్యానించారు.

'ఓడిన వారిని దెప్పిపొడవడం సరికాదు'

By

Published : May 23, 2019, 9:28 PM IST

ప్రజల తీర్పును శిరసావహిస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. కేంద్రంలో హక్కులు సాధించుకునేలా ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం ఎవరితోనైనా పోరాడుతామన్నారు. పొరుగు వారితో ప్రేమగా వ్యవహరించాలని తాము ఆదినుంచీ కొరుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారిని దెప్పిపొడవడం సబబు కాదని వ్యాఖ్యానించారు.

'ఓడిన వారిని దెప్పిపొడవడం సరికాదు'

ABOUT THE AUTHOR

...view details