KTR at Hyderabad Steel Bridge Opening : హైదరాబాద్‌లో మరో మణిహారం అందుబాటులోకి వచ్చింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్(KTR) లాంఛనంగా ప్రారంభించారు. 450 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్.. మిగితా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా పూర్తిగా ఉక్కుతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
Nayani Steel Bridge in Hyderabad :స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను(CM KCR) హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి అని ప్రజలను కోరారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని విజ్ఞప్తి చేశారు. 2023లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే కులాలకు , మతాలకు అతీతంగా ఉండాలన్నారు. గతంలో నగరంలో కర్ఫ్యూలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవని చెప్పారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందన్నారు.
Hyderabad Steel Bridge Features : భాగ్యనగర సిగలో మరో మణిహారం.. స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..?
"తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో 36వ ఫ్లై ఓవర్ ఇది. ఇందిరాపార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తాం. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడింది. మతాల మధ్య చిచ్చుపెట్టి కొందరు పబ్బం గడుపుతున్నారు. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలి." అని కేటీఆర్ అన్నారు.