తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాగా తిట్టండంటూ కేసీఆర్​కు మోదీ ఫోన్ చేసి చెప్తరు' - CONGRESS

"గత రెండు వారాల నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత కాంగ్రెస్​ను తిట్టడం మానేసి భాజపాను తిడుతున్నారు. ఎందుకంటే మళ్లీ మోదీ రాత్రి ఫోన్ చేసి ఇంకా ఎక్కువ తిట్టడంటూ చెప్తరు. తెరాసకు మోదీకీ ఏదో అంతర్గత ఒప్పందం ఉంది": కొండా విశ్వేశ్వర్ రెడ్డి

'బాగా తిట్టండంటూ కేసీఆర్​కు మోదీ ఫోన్ చేసి చెప్తరు'

By

Published : Apr 8, 2019, 3:18 PM IST

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్​పై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎన్ని సార్లు లేఖలు ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. హైదరాబాద్​లో మీట్ ది ప్రెస్​లో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 'సరే సార్... జీ హుజూర్‌... అనే వాళ్లే తెరాసలో ఉండగలుగుతారు కానీ ప్రజాపక్షాన నిలబడి ప్రశ్నించే వాళ్లు అక్కడ ఉండలేరు' అని అన్నారు. అధికార పార్టీలో ఉండి చాలా సమస్యలపై అంతర్గతంగా పోరాడినట్లు తెలిపారు. గొడవ చేస్తే పార్టీ పరువు పోతుందనే గులాబీ దళాన్ని వదిలినట్లు కొండా వెల్లడించారు.

'బాగా తిట్టండంటూ కేసీఆర్​కు మోదీ ఫోన్ చేసి చెప్తరు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details