దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి హస్తం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. బెయిల్ మంజూరు అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వీకరించకుండా... ఎదుటి వారి ఫిర్యాదు తీసుకుని తన కార్యాలయంలో దాడులు చేసి కేసులు పెట్టడం విచిత్రంగా ఉందని ఆవేదన చెందారు. ఒక సిట్టింగ్ ఎంపీ ఫిర్యాదుని స్వీకరించకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్న పోలీసులు సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి తెలంగాణ కోరుకోలేదని తెలిపారు.
ప్రజలు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు: కొండా
దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బెయిల్ మంజురు కావడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తెలంగాణను ప్రజలు కోరుకోలేదని వెల్లడించారు.
ప్రజలు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి