గోదావరిలో రాష్ట్ర నీటి వాటాను కృష్ణాలోకి ఎందుకు తరలించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. కృష్ణాలోకి తరలిస్తే అధిక ప్రయోజనం ఏపీకే దక్కుతుందని పేర్కొన్నారు. కృష్ణానది మీద భారం తగ్గించి గోదావరి నీటిని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సరైన ప్రణాళిక లేకుండా వేల కోట్లు ప్రజాధనం వృథా చేయొద్దని పేర్కొన్నారు. విభజన అనంతరం ఏపీకి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలన్నారు. జులై 13న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి ప్లీనరీ నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయాలు భ్రష్టుపట్టాయని... విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం కోసం అజెండా రూపొందిస్తున్నామని వివరించారు.
మన నీళ్లను కృష్ణాలోకి ఎందుకు తరలించాలి?
గోదావరి నదిలోని నీటి వాటాను కృష్ణనదిలోకి తరలిస్తే... అధిక ప్రయోజనం ఏపీకే దక్కుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుండా వేల కోట్లు ప్రజాధనం వృథా చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు.
మన నీళ్లను కృష్ణాలోకి ఎందుకు తరలించాలి?