Kishan Reddy Fires On Congress : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయనకు తెలంగాణ, బీజేపీ చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల డీఎన్ఏ, గోత్రాలు ఒక్కటేనని ఆరోపించారు. ఒవైసీ బ్రదర్స్ ఆదేశిస్తే.. కేసీఆర్ దేనికైనా తల ఊపుతారని.. కేసీఆర్తో ఇంత సాన్నిహిత్యం ఉన్నా వాళ్లెందుకు పాతబస్తీని అభివృద్ధి చేయలేదని నిలదీశారు.
Telangana Assembly Elections 2023 : రజాకార్ల వారసత్వం కలిగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ దరుసలాం ఇచ్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్లో ప్రకటనలు ఇస్తోందని.. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏ ప్రాతిపాదికన కర్ణాటక ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమన్న కిషన్ రెడ్డి ఇదంతా తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం
"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్కేసుల రాజ్యం వస్తుంది. రాహుల్ గాంధీకి సూటుకేసులు వెళతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం. కామారెడ్డి, గజ్వేల్లో ప్రజల నుంచి బీజేపీకు మంచి స్పందన వస్తుంది. ఈసారి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. కామారెడ్డి, గజ్వేల్ లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు