దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం తీసుకొవస్తామని... రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు బ్యాంకు రుణాలను సకాలంలో తీర్చుకోవాలని తెలిపారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని... తము హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ నగదు రైతుబ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వాస్తవ రైతులకు నష్టం జరగనియ్యమని పేర్కొన్నారు. రైతలకు లబ్ధిచేకూర్చడమే తమ లక్ష్యమని... కౌలుదారులను తమ ప్రభుత్వం గుర్తించదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ ఏడాది ఆర్థికమాంద్యం తీవ్రంగా ఉందని దాని మేరకే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు.
దేశానికే మార్గదర్శకంగా రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: కేసీఆర్ - CM KCR
దేశం అనుసరించేలా అత్యత్తమ రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రూపాయి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'దేశం అనుకరించే విధంగా రెవెన్యూ చట్టం తీసుకువస్తాం'