రైతు భద్రత కోసం ఏ ప్రభుత్వం చేయని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. రైతుల కోసమే బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతు రుణ విమోచన కమిషన్ ఛైర్మన్గా వ్యవసాయ రంగ నిపుణుడైనా లేదా తలపండిన రైతు అయితేనే కర్షకులకు న్యాయం జరుగుతుందనే ఈ సవరణ చేసినట్లు సభలో సీఎం వెల్లడించారు. చిన్న సన్న కారు రైతులకు నేషనలైస్డ్ బ్యాంకుల ద్వారా 42 శాతం వరకు మాత్రమే రుణాలు ఇస్తున్నారని.. అంతకంటే ఎక్కువ శాతం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికి తగ్గిపోతోందని... ఇప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక ఆధారం గోదావరి మాత్రమేనని తెలిపారు. తెలంగాణలో రైతులకు విమోచన కాదు... అసలు కర్షకులు రుణాలు చేసే పరిస్థితే ఉండొద్దని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్నదాతలు అంతా ధనవంతులు కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'
తెలంగాణలో రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతు రుణ విమోచన కమిషన్ ఛైర్మన్ నియామక సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
assembly
Last Updated : Jul 18, 2019, 3:47 PM IST