ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో స్పందించి ఉంటే జూడాలు సమ్మె చేసేవారే కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రికి డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. చర్చలకు పిలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న దాంట్లో వాటా అడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. సమ్మె చేస్తే జూడాలపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి కేటీఆర్‌ను ప్రజలు రోడ్లపై ఉరికిస్తారంటూ విమర్శించారు.
Bandi sanjay: 'సీఎం సకాలంలో స్పందించి ఉంటే జూడాల సమ్మె ఉండేది కాదు'
జూడాల సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం సకాలంలో స్పందించి ఉంటే.. జూడాలు సమ్మె చేసేవారే కాదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది మీద ఒత్తిడి పెరుగుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
'సీఎం సకాలంలో స్పందించి ఉంటే జూడాల సమ్మె ఉండేది కాదు'
వైద్య సిబ్బంది మీద ఒత్తిడి పెరుగుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. సీఎం ఆసుపత్రులను సందర్శించి ఏం సాధించారో అర్థం కావడం లేదన్నారు. జూడాల సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్
Last Updated : May 26, 2021, 6:51 PM IST