ప్రశ్న: అల్ట్రావయోలెట్ శానిటైజర్ పరికరం ఎలా పనిచేస్తుంది?, దీని వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంది?
జవాబు:ప్రస్తుతం రెండు రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బటన్స్ ద్వారా పనిచేయగా... మరొకటి సెన్సార్ల ద్వారా పనిచేస్తోంది. బాక్స్‌ను తెరిచి వస్తువులను అందులో ఉంచి బాక్స్‌ను క్లోజ్ చేసిన తర్వాత... అందులో ఏర్పాటు చేసిన బల్బుల ద్వారా అతినీలలోహిత కిరణాలు ప్రసరించి.. వైరస్‌ను అంతమొందిస్తాయి.
ప్రశ్న: అతినీలలోహిత కిరణాలతో శాటిటైజ్ చేయడం వల్ల వైరస్‌ను పూర్తిగా నశిస్తుందా?
జవాబు: ఈ పరికరం ద్వారా ఇప్పటికే పలు బాక్టీరియాలపై ప్రయోగం చేయగా...కేవలం మూడు నుంచి ఏడు నిమిషాల్లో వాటిని అంతమొందించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌పై ప్రయోగిస్తున్నాం.. అతినీలలోహిత కిరణాల ద్వారా వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ను నివారించవచ్చని తెలిసిందే...