కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు బోయిన్‌పల్లికి చెందిన వి.ఎన్.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వల్లం నవీన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తన వాహనానికి బ్లానర్లుగా కట్టి.. మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు.
ఓల్డ్ బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. మాస్కులు లేనివారికి ఉచితంగా మాస్కులను పంపిణీ చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.