Independence Diamond Jubilee Closing Ceremony at HICC : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు(Swatantra Bharata Vajrotsavaalu) నేటితో ముగిశాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ(HICC)లో జరిగిన ముగింపు వేడుకల్లో ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీ ముందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షించారు.
CM KCR Participated Independence Diamond Jubilee Closing Ceremony : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రప్రభుత్వం గతేడాది నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రారంభ వేడుకలను 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం' పేరిట గత సంవత్సరం ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రారంభ వేడుకలూ ఇక్కడే..:2022 ఆగస్టు 8న హెచ్ఐసీసీ వేదికగానే వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫ్రీడం కప్ పేరిట ఫ్రీడమ్ రన్, ప్రత్యేక ర్యాలీలు, ఆటల పోటీలు, రాష్ట్రమంతటా ఏకకాలంలో ఎక్కడివాళ్లు అక్కడ 'తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన' నిర్వహించారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని రెండు దఫాలుగా ఉచితంగా ప్రదర్శించారు.