తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావమే దీనికి కారణమని... బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

imd-weather-report
ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

By

Published : Aug 25, 2020, 3:01 PM IST

ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. ఉత్తర-దక్షిణ ద్రోణి.. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కేంద్రీకతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి:కొవిడ్​ విలయం: కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు

ABOUT THE AUTHOR

...view details