తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం - క్రియాశీల నగరాల్లో హైదరాబాద్​కు ప్రథమ స్థానం

2020కి గానూ మోస్ట్​ డైనమిక్​ సిటీగా భాగ్యనగరం నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ తెలిపింది. ప్రపంచంలో 20 మోస్ట్ డైనమిక్ నగరాల జాబితాలో భారత్‌లోనే 7 నగరాలు ఉండటం విశేషం. సిటీ మూమెంటం ఇండెక్స్​ను కేటీఆర్​ విడుదల చేశారు.

hyderabad is most dynamic city in world
క్రియాశీల నగరాల్లో హైదరాబాద్​కు ప్రథమ స్థానం

By

Published : Jan 18, 2020, 9:00 PM IST

క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే తొలి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. బెంగళూరును దాటి మొదటిస్థానానికి భాగ్యనగరం చేరింది. 2020కి గానూ మోస్ట్ డైనమిక్ సిటీగా నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ వెల్లడించింది. సిటీ మూమెంటం ఇండెక్స్-2020ను మంత్రి కేటీఆర్​ విడుదల చేశారు.

ప్రపంచంలో 20 మోస్ట్ డైనమిక్ నగరాల జాబితాలో భారత్‌లోనే 7నగరాలు ఉన్నాయి. ప్రపంచంలో 130 నగరాలపై స్థిరాస్తి అధ్యయన సంస్థ సర్వే చేసింది. భారత్ నుంచి ఐదో స్థానంలో చెన్నై, ఏడో స్థానంలో దిల్లీ, పుణెకు 12వ స్థానం, 16వ స్థానంలో కోల్‌కతా, 20వ స్థానంలో ముంబయి నిలిచాయి.

ఇవీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details