సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు హైదరాబాద్లో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. ఒక్కో కేంద్రానికి ప్రత్యేక ఇంఛార్జీలను నియమించామన్నారు. ఎన్నికల పరిశీలకులకు మాత్రమే కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతిస్తామని తెలిపారు. ఈ-సువిధ అనే విధానం ద్వారా ప్రతి రౌండ్ పూర్తి కాగానే ఫలితం వెల్లడిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఒక్కో కేంద్రానికి డీసీపీని బాధ్యులుగా నియమించామన్నారు. ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధించామని స్పష్టం చేశారు.
'పరిశీలకులకు మాత్రమే ఫోన్ అనుమతి'
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సన్నద్ధమైంది. ఈనెల 23న ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దాదాపు 5వేలకు పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
పరిశీలకులకు మాత్రమే ఫోన్ అనుమతి