విద్యార్థి దశను దాటి సమాజంలో అడుగుపెట్టేవారందరికీ ఉద్యోగం తొలిమెట్టు అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ కళాశాలలో నగరపోలీసులు, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు.
'జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
హైదరాబాద్ నగర పోలీసులు... ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీలో నిర్వహించిన జాబ్‌మేళాకు పెద్దసంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు.
'జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
సుమారు 1,800 మంది జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిరుద్యోగులకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో... ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో ఎందరికో ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.