Huge Response to Prajavani Programme : ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం స్థానికంగా ప్రజావాణి(Prajavani) ద్వారా కలెక్టరేట్లలో సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణిని జీహెచ్ఎంసీ పునరుద్దరించింది. కొత్తపేటలోని ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ప్రజావాణీని ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలను అధికారులు పరిశీలించి పరిష్కారం చూపుతారని విజయలక్ష్మీ తెలిపారు.
ఐదు పథకాల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, ఛైర్మన్‌గా భట్టి
Prajavani in Adilabad : ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి సమస్యలు నివేదించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డలో నూతనంగా నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(Double bedrom) లబ్ధిదారులు కలెక్టర్‌ను కలిశారు. గడిచిన అక్టోబర్ నెలలో గత కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులను అలాగే కొనసాగించాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తు అందజేశారు.
లబ్ధి పొందినవారికి అన్యాయం చేయొద్దని గోడు వెల్లబోసుకున్నారు. గతంలో తీసిన డ్రా పద్ధతిలో అవకతవకలు జరిగాయంటూ లబ్ధిదారులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులు ఉంటే వారిని తొలగించి అర్హులైన లబ్ధిదారులను కొనసాగించాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.