TS RTC Cargo Services: మామిడి పండ్లు అంటే ఎవరికైనా నోరూరుతుంది. మార్కెట్ లో లభించే మామిడి పండ్లు రసాయనాలతో పండిస్తారనే అనుమానం ప్రజల్లో ఉంటుంది. కానీ నేరుగా మీరు మెచ్చే బంగినపల్లి మామిడి పండ్లను మీ ఇంటి వద్దకే టీఎస్ఆర్టీసీ తీసుకువస్తోంది.
మామిడి పళ్లు కావాలనుకునే వారు http://www.tsrtcparcel.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 5 కిలోల నుంచి 10 టన్నుల వరకు బల్క్ బుకింగ్ చేసుకోనే సదుపాయం ఉందన్నారు. కిలో బంగినపల్లి మామిడి పండ్ల ధర రూ.115 ప్రకారం.. బుక్ చేసిన వారం రోజుల్లోనే కార్గో సేవల ద్వారా వినియోగదారుల ఇంటికి చేర్చడం జరుగుతుందని వివరించారు. మరిన్ని వివరాలకు సంస్థ కాల్ సెంటర్ నెంబర్ 040-23450033 , 040-69440000 సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.