తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మెపై గతంలో సమర్పించిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది.

ఆర్టీసీ సమ్మెపై నేడు మరోసారి హైకోర్టు విచారణ

By

Published : Nov 7, 2019, 6:05 AM IST

Updated : Nov 7, 2019, 10:25 AM IST

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్​ఛార్జ్​ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ శర్మ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు నిన్ననే నివేదికలు సమర్పించారు.

ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా బకాయిలేమని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ న్యాయస్థానానికి తెలిపాయి. నిజమేనని ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీనే 540 కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. చట్టం ప్రకారం ఆర్టీసీకి కచ్చితంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని... ఆర్థిక పరిస్థితిని బట్టి ఇస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ అఫిడవిట్లపై వాదించేందుకు కార్మిక సంఘాలు కూడా సిద్ధమయ్యాయి. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.

ఆర్టీసీ సమ్మెపై నేడు మరోసారి హైకోర్టు విచారణ

ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ

Last Updated : Nov 7, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details