తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరు గంటల్లో 106 మిల్లిమీటర్ల వర్షం

భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అల్వాల్​ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవథిలో 106 మిల్లిమీటర్ల వర్షం పడింది. లక్ష దీవులు నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో క్యూములోనింబస్​ మేఘాలు ఏర్పాడి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

వర్షం

By

Published : Oct 12, 2019, 5:33 AM IST

Updated : Oct 12, 2019, 7:30 AM IST

ఆరు గంటల్లో 106 మిల్లిమీటర్ల వర్షం

లక్ష దీవులు నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అప్పటికప్పుడు క్యూములోనింబస్​ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం పడుతుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షం కురిసే సూచనలున్నాయన్నారు.

378 ప్రాంతాల్లో వర్షాలు

హైదరాబాద్​లోని పలు చోట్ల క్యూములోనింబస్​ మేఘాలు ఏర్పాడి కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు 378 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్వాల్​ 106, మిర్​దొడ్డి 96.3, పెద్దకోడూరు 93.8, అల్వాల్​ కొత్తబస్తీ 83, లచ్చపేట 79.3, సదాశివనగర్​ 74, సికింద్రాబాద్​ పాటిగడ్డ 65.5, పాత బోయిన్​పల్లిలో 49.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.

రికార్డు

అల్వాల్​ టెలికాం కాలనీలో ఆరు గంటల వ్యవథిలో 106 మిల్లిమీటర్ల వర్షం పడింది. ఇంతకుముందు బేగంపేట విమానాశ్రయం వద్ద 2013 అక్టోబరు 10న 98.3 మి.మీ వర్షపాతం నమోదయింది.

ఇవీ చూడండి: "ఈఎస్​ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!

Last Updated : Oct 12, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details