వైద్యులు చెప్పిన సమాచారం రోగి బంధువులకు అర్థంకాక సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. బతికున్న వ్యక్తిని చనిపోయాడనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్చెరుకు చెందిన భాను ఈనెల 28 రాత్రి తన స్నేహితునితో కలసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనకనుండి వచ్చిన కారు ఢీకొనడంతో భానుకు తీవ్రగాయాలయ్యాయి.. ప్రమాదం జరిగిన వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో బుధవారం సికింద్రాబాద్ గాందీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈవిషయం అర్థంకాని రోగిబంధువులు చనిపోయడనుకుని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు చికిత్సపొందుతున్న రోగినిచూసి నివ్వెరపోయారు. వైద్యులే తమకు చనిపోయాడని చెప్పడంతోనే ఫిర్యాదు చేశామని రోగికుటుంబీకులు ఆరోపిస్తున్నారు.