హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస Harish Rao vs Rajagopal Reddy in Assembly :అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, హరీశ్‌రావు మధ్య మాటల సంవాదం వాడీవేడి చర్చకు దారితీసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మీరు ఎంత మొత్తుకున్నా మంత్రి పదవి రాదని హరీశ్‌రావు వ్యాఖ్యానించటంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు ఎంత కష్టపడినా కేసీఆర్(KCR), కేటీఆర్ వాడుకుని వదిలేస్తారే తప్ప బీఆర్ఎస్లో న్యాయం జరగదని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.
మాటలు చెప్పటంలో హరీశ్‌రావుకు మేనమామ(కేసీఆర్) పోలికలు వచ్చాయని, అబద్ధాలను నిజం చేయటంలో కేసీఆర్ వాక్చాతుర్యం కుటుంబసభ్యుల్లో ప్రధానంగా హరీశ్‌రావుకు వచ్చింది. గత సమావేశాల్లో వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని, ప్రసంగానికి అడ్డుపడుతున్నానని మీరు ఎంత మొత్తుకున్నా మంత్రి పదవి మీకు రాదు అన్నారు. అందుకే నేనేమంటున్నా మీరు ఎన్నాళ్లు బీఆర్ఎస్లో కష్టపడినా మీకు సీఎం పదవైతే దక్కదు. తండ్రీకొడుకులు మిమ్మల్ని వాడుకుంటారే కానీ మీకు అక్కడ న్యాయం జరగదు. -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు
శ్వేతపత్రం మమ్మల్ని బద్నాం చేసేందుకేనన్న బీఆర్ఎస్ - వాస్తవాలు ప్రజలముందుంచామన్న అధికారపక్షం
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు వెల్‌లోకి వెళ్లడంపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మేము దశాబ్దకాలం పాటు ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ ఇలా ఎన్నడూ వెల్‌లోకి వెళ్లలేదు. బీఆర్ఎస్ నేతలు పట్టుమని రెండు రోజులు కూడా ఓపిక పట్టక పోవటం కాలేదు, ఇంతలా దూసుకువెళ్లటమేంటి? ఇదెక్కడి న్యాయం. మీరు మాట్లాడినదానిమీద వారు మాట్లాడారు.-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడిన హరీశ్‌రావు, కాంగ్రెస్ పార్టీలోలా రూ.50కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ తమకు పట్టలేదని వ్యాఖ్యానించారు. హరీశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం ఈ వ్యాఖ్యల్ని వెనక్కితీసుకోవాలని లేకుంటే బహిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) స్పీకర్‌ను కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెనక్కి తీసుకుంటే తాను ఉపసంహరించుకుంటానని హరీశ్‌రావు అన్నారు.
హరీశ్‌రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం
Komatireddy Venkat Reddy Reddy Comments on Harish Rao :ఇరువైపులా సభ్యుల మాటలతో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో తన మాటల్ని ఉపసంహరించుకోవాలని హరీశ్‌రావును స్పీకర్ కోరారు. ఇందుకు స్పందించిన హరీశ్, ఇద్దరి వ్యాఖ్యలు తొలగించాలని కోరారు. దీంతో హరీశ్‌రావు వ్యాఖ్యల్ని రికార్డుల్ని తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా అంతర్గత రాజకీయాలు, ఎప్పుడో సమసిపోయినా అంశాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీగా ఒక సిద్ధాంతం ఉంది. దానిప్రకారమే నాయకుడుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం. ఆయన నాయకత్వంలో మంత్రివర్గం సహా ప్రభుత్వం దిగ్విజయంగా నడుస్తోంది. మీకేం పనిలేదా? మీరు పదేళ్లలో ఏమి చేశారో అది చెప్పండి. -కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి
అప్పులపై శ్వేతపత్రం ఇస్తే కొత్త అప్పులు ఎట్లా పుడతాయి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్ రెడ్డి