ఏపీ కర్నూలులో బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేదంటే మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులోని రాజ్‌విహార్ కూడలి నుంచి కోట్ల సర్కిల్ వరకు పవన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోట్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
వారికి న్యాయం చేయకపోతే నిరాహార దీక్ష చేస్తా: పవన్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే కర్నూలులో నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించారు.
వారికి న్యాయం చేయకపోతే నిరాహార దీక్ష చేస్తా: పవన్
బాలికపై సామూహిక అత్యాచారంపై ఏ ఒక్కరూ పట్టించుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి అధికారులకు ఉన్నా... నేతల వల్ల ఆగిపోయారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరగకపోతే కర్నూలును న్యాయ రాజధానిగా మార్చినా ఉపయోగం లేదన్నారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే కర్నూలులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. అలాగే నగరంలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.