తెలంగాణ

telangana

ETV Bharat / state

ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన గుత్తా... సీఎం ఆరా! - తెలంగాణ వార్తలు

ఛాతినొప్పితో బాధపడుతూ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. రెండుచోట్ల రక్తనాళాలు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

gutha-sukender-reddy-admitted-in-hospital-due-to-heart-problem-and-cm-kcr-review-on-his-health
ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిన గుత్తా... సీఎం ఆరా!

By

Published : Mar 8, 2021, 8:48 AM IST

Updated : Mar 8, 2021, 4:22 PM IST

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఛాతినొప్పితో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆదివారం చేరారు. రెండుచోట్ల రక్తనాళాలు మూసుకుపోయినట్లు పరీక్షల్లో వైద్యులు గుర్తించారు. చికిత్స చేసి రెండు స్టెంట్‌లు వేశారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌... గుత్తా సుఖేందర్‌ కుటుంబసభ్యుల ద్వారా ఆయన పరిస్థితిపై ఆరాతీశారు.

మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి... ఆయన్ని ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం సుఖేందర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష

Last Updated : Mar 8, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details