తెలంగాణ

telangana

గిన్నిస్ రికార్డుల్లో హైదరాబాద్ ఉంగరం

By

Published : Oct 20, 2020, 7:50 AM IST

ఓకే ఉంగరాన్ని అత్యధిక వజ్రాలతో తయారు చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు భాగ్యనగరం వేదికైంది. హైదరాబాద్​కు చెందిన 'ది డైమండ్ స్టోర్' యజమాని కొట్టి శ్రీకాంత్ ఈ ఘనతను సాధించాడు. 'ది డివైన్​-7801' బ్రహ్మ వజ్ర కమలం పేరుతో ఉంగరాన్ని తయారు చేశామని ఆయన తెలిపారు.

Guinness world rwcord by diamond ring in hyderabad
గిన్నిస్ రికార్డుల్లో హైదరాబాద్ ఉంగరం

భాగ్యనగరం సిగలో మరో రికార్డు వచ్చి చేరింది. అద్భుతాలకు ఆనవాలుగా నిలిచే హైదరాబాద్​ మరో గిన్నిస్ రికార్డుకు వేదికగా నిలిచింది. జూబ్లీహిల్స్​లోని ది డైమండ్ స్టోర్ యజమాని కొట్టి శ్రీకాంత్ ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో ఉంగరాన్ని తయారు చేశారు. దీనికి 'మోస్ట్ డైమండ్స్ ఇన్​ ఎ రింగ్' వరల్డ్ గిన్నిస్ అవార్డు దక్కింది. గతంలో ముంబయికి చెందిన ఓ వ్యాపారి 7,777 వజ్రాలతో రూపొందించిన రికార్డును అధిగమించింది.

ఒకే ఉంగరంలో 7801 వజ్రాలను పొదిగించడం ఈ రికార్డు సాధ్యమైందని శ్రీకాంత్ అన్నారు. ఈ ఉంగరాన్ని 'ది డివైన్-7801' బ్రహ్మ కమలంగా నామకరణం చేశామని ఆయన తెలిపారు. ఇందులో ఆరు పూలరేకులు, ఐదు వరుసలలో ఎనిమిది రేకులు, మూడు పుప్పొడి రేణువులతో రూపొందించామన్నారు. ఈ ఉంగరం తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టిందన్నారు. తమ స్టోర్​కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నవంబర్ నెలలో వేలం నిర్వహించి, ఉంగరాన్ని విక్రయిస్తామని సంస్థ నిర్వాహకులు చందుభాయ్, శ్రీకాంత్ వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేతకు వెంకయ్య అభినందన

ABOUT THE AUTHOR

...view details