Gruhalakshmi Scheme in Telangana : గృహలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం(Gruha Laxmi Scheme) కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. వందశాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. స్టేట్ రిజర్వ్ కోటాలో 43వేలు.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరనుంది.
Telangana Gruhalakshmi Scheme Eligibility : జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. వారే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇళ్లు పూర్తి మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులన్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వు కింద లబ్ది పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ.. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు
Collectors Selected Gruhalakshmi Scheme Beneficiaries ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు పదిశాతం, బీసీ- మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపింది. జిల్లాల వారీగా దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధిస్తారో వారికి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్లు ఈ పథకం వర్తింపు చేస్తారు. ఆర్థికసాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థికసాయం అందిస్తారు. అధికారులు లబ్దిదారులను పరిశీలించి జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం బ్యాంక్ ఖాతాల్లో నగదు వేయనున్నారు.