తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు - Governor Tamilsai Appointments in Virtual Policy

ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వర్చువల్ విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారితో లైవ్​లో మాట్లాడనున్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్ నుంచి తమిళిసైతో మాట్లాడే వెసులుబాటు కల్పించారు.

వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు
వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు

By

Published : Feb 24, 2021, 7:53 PM IST

అదనపు బాధ్యతల్లో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వర్చువల్ విధానంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారు హైదరాబాద్ రాజ్​భవన్ దర్బార్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంలో గవర్నర్​తో మాట్లాడే వెసులుబాటు కల్పించారు. అపాయింట్‌మెంట్ ​కోసం ఈ-మెయిల్ ద్వారా రాజ్​భవన్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ​రాజ్​భవన్ అధికారులతో ఇవాళ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించిన తమిళిసై... రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తాను ఎక్కడున్నా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ-ఆఫీస్ విధానంలో అన్ని ఫైళ్లను పరిష్కరించినట్లు తెలిపారు.

రెడ్ క్రాస్ సంస్థ బాధ్యులతోనూ సమీక్షించిన తమిళిసై... దాతల్లో స్ఫూర్తి నింపి రక్తదానానికి ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. ఛాన్స్​లర్ కనెక్ట్స్ అలూమ్నీ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థులను రాజ్ భవన్ వెబ్ సైట్ ద్వారా అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details