ఆంధ్రప్రదేశ్లోని విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్న గవర్నర్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ సోదరులకు తెలంగాణ ప్రజలు నైతిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.
విశాఖ ప్రజలకు నైతిక మద్దతు అందించాలి: తమిళిసై
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. విశాఖ సోదరులకు తెలంగాణ ప్రజలు నైతిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.
విశాఖ ప్రజలకు నైతిక మద్దతు అందించాలి: తమిళిసై