తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్యసభకు దరఖాస్తు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తాను రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. తనపై సీఎం, కేటీఆర్‌ సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన అన్నారు.

former MP Ponguleti applied to the Rajya Sabha seats in telangana
రాజ్యసభకు దరఖాస్తు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి

By

Published : Mar 7, 2020, 5:49 PM IST

రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దృష్టిలో అనేక సమీకరణాలు ఉన్నప్పటికీ తనపై సీఎం, కేటీఆర్‌ సానుకూల దృక్పథంతో ఉన్నారని పొంగులేటి అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తర్వాత పలు విషయాలను ఆయన వెల్లడించారు. జిల్లా రాజకీయాలను సీఎం పరిగణలోకి తీసుకొని సీట్లు కేటాయించారన్నారు. అన్ని విషయాలపై సీఎం, కేటీఆర్‌కు అవగాహన ఉన్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.

  1. ఇదీ చూడండి :ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details