భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితిపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను ఆయన అభినందించారు.
సీఎం సహాయ నిధికి మాజీ గవర్నర్ రూ.25వేల విరాళం
హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వంతు సాయంగా 25 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
సీఎం సహాయ నిధికి మాజీ గవర్నర్ విరాళం
సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా 25 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. త్వరలోనే పరిస్థితి కుదుట పడాలని ఆకాంక్షించారు. మాజీ గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:వరద బాధితుల కోసం పవన్.. రూ.కోటి విరాళం
Last Updated : Oct 21, 2020, 6:33 PM IST