Foreign Thieves In Hyderabad : విదేశీ ముఠాలు నగరంలోకి చొరబడ్డాయి. మీరు విన్నది నిజమే.. విదేశీ గ్యాంగ్‌లు హైదరాబాద్‌పై కన్నేశాయి. ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర ముఠాలు మాత్రమే రాజధానిలో చోరీలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు పర్యాటకుల ముసుగులో విమానాల్లో వచ్చి విదేశీయులు కూడా చోరీలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ దొంగల ముఠాలు దేశాల హద్దులను చెరిపేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఐవరీకోస్ట్ నుంచి జాన్ గుయే రోస్టాండ్ బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కరెన్సీ నోట్లను రెట్టింపు చేస్తానంటూ నమ్మించి.. ఈ నెలలో మాదాపూర్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ విదేశీయుడిపై పోలీసులు నిఘా ఉంచితే.. ఎల్బీనగర్లో మరో మోసానికి పాల్పడుతున్నాడనే సమాచారంతో రాచకొండ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
Foreign Thieves Gang Robbing Hyderabad In Guise Of Tourists : కొవిడ్ అనంతర పరిస్థితులతో అనేక దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆర్థిక పరిస్థితులు ఎదురవడంతో పర్యాటకులుగా వచ్చి వివిధ దేశాల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. రోబరీ చేయడానికి ముందు.. ఏ దేశంలో తేలిగ్గా వీసా అనేది లభిస్తుందో ఎంపిక చేసుకుంటారు. భారత్‌లో అయితే పర్యాటక వీసా తేలిగ్గా లభిస్తుండటంతో.. ఏయే నగరాల్లో చోరీలు చేయాలో ముందుగానే ఎంపిక చేసుకుంటారు.