తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథ బిడ్డల హక్కుల కోసం అంతర్జాతీయ సదస్సు - అనాథ బిడ్డల హక్కుల కోసం అంతర్జాతీయ సదస్సు

అనాథ బిడ్డల హక్కుల కోసం హైదరాబాద్​లో ఓ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఫోర్స్‌ ఫర్‌ ఆర్ఫన్‌ రైట్స్‌ అండ్‌ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8, 9తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

Force_National_Confrence in hyderabad
అనాథ బిడ్డల హక్కుల కోసం అంతర్జాతీయ సదస్సు

By

Published : Jan 28, 2020, 5:19 PM IST

అనాథ బిడ్డల హక్కుల సాధన కోసం 'ఫోర్స్‌ ఫర్‌ ఆర్ఫన్‌ రైట్స్‌ అండ్‌ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌' ఆధ్వర్యంలో భాగ్యనగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించిన క్యాలెండర్‌ను హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్స్‌ ఫర్‌ ఆర్ఫన్‌ రైట్స్‌ అండ్‌ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌ అధ్యక్షుడు గాదె ఇన్నయ్య, హాలీవుడ్‌ దర్శకుడు జగదీష్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అనాథ పిల్లలకు ఒక్క చక్కటి నిర్వచనం ఇవ్వాలని గాదె ఇన్నయ్య కోరారు. అనాథ పిల్లలకు జనన ధృవీకరణ పత్రంతో పాటు ఓటు హక్కును కల్పించాలన్నారు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని సంరక్షించాలని హాలీవుడ్‌ దర్శకుడు జగదీష్‌ సూచించారు.

అనాథ బిడ్డల హక్కుల కోసం అంతర్జాతీయ సదస్సు

ఇవీ చూడండి: మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కావాలి : హరీశ్​రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details