తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతన్న ఆలోచన అదిరింది.. పంట ఒడ్డుకు చేరింది - vundavalli banana farmer news

పండించిన పంట నీటి పాలు కాకుండా ఏపీలోని ఓరైతు వినూత్న ఆలోచన చేశారు. అనుకోని పరిస్థితిని సైతం తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి పంటను కాపాడుకున్నారు.

farmer-innovative-idea-saved-the-banana-crop-from-floods
రైతన్న ఆలోచన అదిరింది.. పంట ఒడ్డుకు చేరింది

By

Published : Oct 19, 2020, 12:27 AM IST

రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న అరటి తోటలో మోకాలు లోతు నీరు. పండిన పంటను బయటకు తీసుకురావడానికి కూలీకే తడిసి మోపెడవుతోంది. దీనికి తోడు తోట వెంట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన రైతు నగేష్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు.

తోటలో కోసిన సుమారు 60 అరటి గెలలను తోరణాల్లా తాడుకు కట్టారు. దానిని పట్టుకుని వరద ప్రవాహంలో వాలు వైపు అరటి డొప్పపై తేలియాడుతూ కిలోమీటరు మేర మరొకరి సాయంతో తీసుకొచ్చి ఒడ్డుకు, అక్కడ నుంచి రోడ్డుకు చేర్చారు. దీనితో గెలకు 25 రూపాయలు చొప్పున అయ్యే కూలీతోపాటు రవాణా ఛార్జీలు కలిసొచ్చాయి.

రైతన్న ఆలోచన అదిరింది.. పంట ఒడ్డుకు చేరింది

ఇదీ చదవండి:వరదపోటు నుంచి తేరుకోలేకపోతోన్న పాతబస్తీ

ABOUT THE AUTHOR

...view details