తెలంగాణ

telangana

వ్యాయామంతో ఆరోగ్యం: ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Dec 13, 2020, 12:22 PM IST

వ్యాయామం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ మాదాపూర్​లోని నోవాటెల్ హోటల్లో సీఐఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్​నెస్ రన్​ని ఆయన ప్రారంభించారు.

excise minister srinivas goud inaugurated wellnessrun in hyderabad
వ్యాయామంతో ఆరోగ్యం: ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

హైదరాబాద్​ మాదాపూర్​లోని నోవాటెల్ హోటల్లో సీఐఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్​నెస్ రన్​ని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఐఐ యూవర్ లైఫ్​తో కలిసి వెల్​నెస్ రన్ 2020ని నిర్వహించింది. వ్యాయామం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని.. అందుకు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. నడక, పరుగును ప్రతి ఒక్కరూ ప్రతి రోజు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ మాజీ ఛైర్మన్ సంజయ్ సింగ్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, తెలంగాణ డిఫెన్స్ ప్యానెల్ కన్వీనర్ ఆర్ఎస్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

ABOUT THE AUTHOR

...view details