నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఓ వైపు ఓటరు నమోదు ప్రక్రియ.. మరోవైపు ప్రచారాన్ని సమాంతరంగా నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని తాను ఊహించలేదని.. గ్రామాల్లో పర్యటిస్తుంటే అర్థమవుతుందని కోదండరాం తెలిపారు.
'ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని పొరపాటు చేశా'
రాష్ట్రంలో సాగుతున్నబాధ్యతారహిత్యమైన పాలనకు చరమగీతం పాడాలంటే.. విపక్షాలు ఒక్కటి కావాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ నుంచి తప్పుకుని పొరపాటు చేశామని.. ఇప్పుడు ఆ తప్పు పునరావృతం కాదంటున్న కోదండరాంతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ నుంచి తప్పుకుని పొరపాటు చేశా'
రాష్ట్రంలో సాగుతున్నబాధ్యతారహిత్యమైన పాలనకు చరమగీతం పాడాలంటే.. విపక్షాల మధ్య ఐక్యత అవసరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ నుంచి తప్పుకుని పొరపాటు చేశామని.. ఇప్పుడు ఆ తప్పు పునరావృతం కాదని వెల్లడించారు. ఇతర పార్టీల కంటే.. తమ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తామంటున్న కోదండరాంతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
- ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్