ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో మరో దఫా ఇవాళ సాయంత్రం చర్చలు జరిపారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధుల డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడం వల్ల చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు కమిటీ వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కంటే ఆరోగ్యశ్రీ వంద రెట్లు బాగా అమలవుతుందన్నారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. చర్చలు సఫలమైన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి.
ఆరోగ్యశ్రీపై మంత్రి ఈటల చర్చలు సఫలం
ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో మరో దఫా ఇవాళ సాయంత్రం చర్చలు జరిపారు.
eetala
ఇవీ చూడండి:కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
Last Updated : Aug 20, 2019, 11:39 PM IST