తెలంగాణ

telangana

ETV Bharat / state

'​ మిషన్​ భగీరథకు కేంద్రం సాయం చేయాలి'

మిషన్​ భగీరథకు కేంద్రం సాయం చేయాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కోరారు. దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన 'గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్​ నిర్వహణ' సదస్సుకు హాజరయ్యారు.

ఎర్రబెల్లి

By

Published : Jun 11, 2019, 7:05 PM IST

దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో కేంద్ర జల శక్తి శాఖ నేతృత్వంలో 'గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్​ నిర్వహణ' పై సదస్సు నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​ శెకావత్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు హాజరయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందిస్తున్నామని దయాకర్ రావు అన్నారు. 45 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ పథకానికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని ఈ సదస్సులో కోరినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

'​ మిషన్​ భగీరథకు కేంద్రం సాయం చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details