సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు. గత నాలుగైదు రోజుల నుంచి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సొంత ఊర్లో పండగను ఘనంగా జరుపుకునేందుకు పిల్లాపాపలతో చాలా మంది వెళ్లిపోయారు. రహదారులు చాలా మేరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సుమారు కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో 50లక్షల వాహనాలు నిత్యం రహదారులపై తిరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో రద్దీగా ఉంటాయి. ఉదయం , సాయంత్రం వేళల్లో అయితే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుంది.