Electric wires on railway tracks: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలం రైల్వేస్టేషన్ సమీపంలోని సంతరావూరు రైల్వే గేటు వద్ద చీరాల వైపు వెళ్లే డౌన్‌లైన్‌లో రైళ్లకు విద్యుత్ అందించే హైటెన్షన్ తీగలు తెగి ఒంగోలు వైపు వెళ్లే అప్‌లైన్ రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో విజయవాడ-గూడూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చీరాల, ఒంగోలు రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు గంటపాటు నిలిచిపోయాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
పట్టాలపై హైటెన్షన్ విద్యుత్ తీగలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం - bapatla train track
Electric wires on railway tracks: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో రైలు పట్టాలపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రైళ్లకు విద్యుత్ అందించే తీగలు తెగి పడటంతో.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కాసేపు ఇబ్బందిపడ్డారు.
ఏపీలో పట్టాలపై హైటెన్షన్ విద్యుత్ తీగలు