హైదరాబాద్ సింగరేణికాలనీలో పనిచేసే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఏకలవ్య ఫౌండేషన్ అక్షయ విద్య సంస్థతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో కూడా అంగన్‌వాడీ టీచర్లు ఆయాలు, ఆశవర్కర్లు మురికి వాడల్లో ముందుండి సేవలు చేస్తున్నందున… వారికి సహాయం అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏకలవ్య ఫౌండేషన్ మేనేజర్ నరేష్ తెలిపారు.
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశవర్కర్లకి నిత్యావసరాల అందజేత
కరోనా సమయంలో హైదరాబాద్ మురికివాడల్లో ముందుండి సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఏకలవ్య ఫౌండేషన్ అండగా నిలిచింది. నిత్యవసరాలు అందజేసి వారికి అండగా నిలిచింది.
Ekalavya foundation distributs essentials to aasha workers in Hyderabad
రేకపల్లి వెంకట సీతారామయ్య మంగ తాయారమ్మవారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్షయ విద్యలో చదువుకునే పిల్లల కుటుంబాలకు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఆయాలకు కలిపి 142కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు నరేష్ తెలిపారు.
ఇదీ చుడండి:నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే.. పటిష్ఠ ఏర్పాట్లు చేసిన తితిదే